విడుదల అయిన సుమంత్ 'సుబ్రహ్మణ్యపురం' టీజర్!
- October 19, 2018
సుమంత్ హీరోగా దర్శకుడు సంతోష్ జాగర్లమూడి 'సుబ్రహ్మణ్యపురం' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సుమంత్ సరసన ఈషా రెబ్బ హీరోయిన్ గా కనిపించనుంది. ఆధ్యాత్మిక అంశాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్ ని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. హేతుబద్ధంగా పురాతన ఆలయాలపై రీసెర్చ్ చేసే వ్యక్తి పాత్రలో సుమంత్ కనిపించనున్నారు. ఇప్పటికేసినిమా పోస్టర్లతో ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేసిన చిత్రబృందం టీజర్ తో అంచనాలను మరింతగా పెంచేసింది. ఒక ఊరిలో వరుసగా జరిగే హత్యలు ఎవరికి అంతుచిక్కని ఎన్నో ప్రశ్నలు వీటిపై ఇన్వెస్టిగేట్ చేయాలని నిర్ణయించుకునే హీరో.. ఇలా టీజర్ నిఆసక్తికరంగా కట్ చేశారు. 'ఎదురొస్తే ఏం చేస్తాడండీ.. మీ దేవుడు' అని సుమంత్చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







