అష్టకష్టాలు పడుతున్న యెమెన్‌ నిర్వాసితులు.. సాయం కోసం ఎదురుచూపులు

- October 22, 2018 , by Maagulf
అష్టకష్టాలు పడుతున్న యెమెన్‌ నిర్వాసితులు.. సాయం కోసం ఎదురుచూపులు

అడెన్‌ : యుద్ధంతో అతలాకుతలమవుతున్న యెమెన్‌కు మానవతా సాయం అందక పోవడం తో అక్కడ దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా నిర్వా సితులైన వేలాదిమంది యెమెన్‌ ప్రజలు శీతా కాలంలో ఆరుబయట ఎముకలు కొరికే చలిని తట్టుకుని జీవనం సాగించాల్సి వస్తుంది.. అమెరికా అండదండలతో సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి యమెన్‌పై జరుపుతున్న దాడుల్లో దక్షిణ ఓడరేవు పట్టణమైన అడెన్‌ శివార్లలో పెద్ద సంఖ్యలో జనం నిర్వాసితులయ్యారు. వీరు ఎర్ర సముద్రం తీరప్రాంత పట్టణమైన హొడైడాకు వలస వచ్చారు. ఇక్కడ నిత్యావసరాలైన నీరు, విద్యుత్‌ వంటివి లేకపోవడంతో ఏడారి ప్రాంతంలో జీవించడానికి వారు అష్టకష్టాలు పడుతున్నారు. తమను తక్షణమే ఆదుకోవాలని వారు అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నారు. అడెన్‌ శివార్లలో నిర్వాసితులు గుడిసెల్లో వుంటున్నారు. తుపానులు, అత్యంత శీతల పరిస్థితులతో ఇప్పటికే తాము ఇబ్బందులు పడుతున్నామని, శీతాకాలం పూర్తి స్థాయిలో వస్తే తమ కష్టాలు మరింత పెరుగుతాయని అడీబ్‌ ఒమర్‌ అనే నిర్వాసితుడు పేర్కొన్నారు. ఎడారి ప్రాంతంలో అత్యంత శీతలమైన రాత్రుళ్ళు భరించడం కష్టమని అన్నారు. ఇప్పటికే సరైన ఆహారం లేక పిల్లలు, వృద్ధులు బాధ పడుతున్నారని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com