ఇజ్రాయిల్‌ జరిపిన దాడిలో లెబనాన్‌ కీలక ఉగ్రనేత కుంతార్‌ హతం

- December 20, 2015 , by Maagulf
ఇజ్రాయిల్‌ జరిపిన దాడిలో లెబనాన్‌ కీలక ఉగ్రనేత కుంతార్‌ హతం

 సిరియాలోని డమాస్కస్‌లో ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయిల్‌ జరిపిన దాడిలో లెబనాన్‌ హిజ్బుల్లా ఉగ్రసంస్థకు చెందిన కీలక నేత సమీర్‌ కుంతార్‌ హతమయ్యాడు. ఈ విషయాన్ని సిరియా ప్రభుత్వ వర్గాలు, హిజ్బుల్లా వర్గాలు ధ్రువీకరించాయి. సమీర్‌ నివాస ప్రాంతంపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడి చేసిందని హిజ్బుల్లా వర్గాలు పేర్కొన్నాయి. సమీర్‌ మృతిని ఇజ్రాయిల్‌ మంత్రి ఒకరు స్వాగతించారు. కానీ ఈ దాడులు ఇజ్రాయిలే చేయించిందన్న ఆరోపణలపై మాత్రం ఆయన మౌనం వహించారు. కుంతార్‌ను 2008లో సిరియా అధ్యక్షుడు బషర్‌ అసద్‌ సిరియన్‌ పతాకంతో సత్కరించడం గమనార్హం. ఇజ్రాయిల్‌పై ఉగ్రవాదులు జరిగిన పలు దాడుల్లో కుంతార్‌ హస్తం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com