ఇరాక్ లో 43 ఏళ్ల తరువాత అందాల పోటీలు
- December 20, 2015
ఇరాక్ చరిత్రలో నాలుగ దశాబ్దాల అనంతరం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఉగ్రవాదుల కాల్పులతో అట్టుడికే ఇరాక్ లో 43 ఏళ్ల తరువాత అందాల పోటీలు నిర్వహించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో ఫైవ్ స్టార్ హోటల్లో శనివారం నిర్వహించిన ఈ పోటీల్లో 20 ఏళ్ల పొడుగు కాళ్ల సొగసరి శ్యామా అబ్దుల్ రెహ్మాన్ మిస్ ఇరాక్ కిరీటాన్ని సగర్వంగా అందుకుంది. ఇరాక్ లోని కిర్ కుక్ నగరానికి చెందిన శ్యామా రెహ్మాన్ ఓవరాల్ ఓటింగ్ లో తొలి స్థానంలో నిలిచి కిరీటాన్ని చేజిక్కించుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న మిగిలిన అందాల భామలు 'మిస్ ఇరాక్' కిరీటాన్ని ఆమె తలపై పెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







