విశాఖలో కోహ్లీ అరుదైన రికార్డు
- October 24, 2018
విశాఖ:వన్‌సైడ్‌గా సాగుతోన్న భారత్,విండీస్ క్రికెట్ సమరంలో మరో మ్యాచ్‌కు అంతా సిధ్ధమైంది. ఈసారి సాగరతీరం విశాఖలో పరుగుల వర్షం కురవబోతోంది. తొలి వన్డే తరహాలోనే విశాఖలోనూ రన్ఫీస్ట్ అభిమానులను అలరించబోతోంది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తోన్న టీమిండియానే ఈ మ్యాచ్‌లోనూ ఫేవరెట్.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ విజయానికి చేరువయ్యేందుకు కోహ్లీసేన ఎదుకుచూస్తోంది. మొదటి వన్డేలో విండీస్ భారీస్కోర్ చేసినా… భారత బ్యాటింగ్ ముందు తేలిపోయింది. రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ వీరవిహారానికి విండీస్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. ఫామ్‌లో ఉన్న వీరిజోడీ మరోసారి చెలరేగితే.. విండీస్‌కు ఓటమి తప్పదు.
కాగా కోహ్లీ అరుదైన రికార్డు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పదివేల పరుగుల మైలురాయికి చేరువలో ఉన్న భారత కెప్టెన్ సాగరతీరంలోనే దానిని అందుకోవాలని విశాఖ అభిమానులు కోరుకుంటున్నారు. అటు రోహిత్, ధావన్ కూడా రెచ్చిపోతే అభిమానులకు పరుగుల పండుగే. బౌలింగ్‌లోనూ భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా… తొలి మ్యాచ్‌లో భారీగా పరుగులివ్వడం ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు టెస్ట్ సిరీస్‌తో పోలిస్తే వన్డేల్లో బ్యాటింగ్ పరంగా విండీస్ బాగానే రాణిస్తోంది. భారత బౌలర్లపై ఆధిపత్యం కనబరిచిన 300కు పైగా స్కోర్ చేయడం దీనికి నిదర్శనం. అయితే అనుభవం లేని బౌలర్ల కారణంగా ఓటమి పాలవుతోంది. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్గా పేరున్న టీమిండియాను కట్టడి చేయడం కరేబియన్ బౌలర్లకు సవాలే. మరి సాగరతీరంలో విండీస్ ఎంతవరకూ పోటీనిస్తుందనేది వేచి చూడాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!