దీపావళి కానుకగా ఇండిగో బంపర్ ఆఫర్

- October 25, 2018 , by Maagulf
దీపావళి కానుకగా ఇండిగో బంపర్ ఆఫర్

ఢిల్లీ: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ విమానాయ సంస్థ ఇండిగో ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీపావళి స్పెషల్‌ సేల్‌ పేరుతో అత్యంత తక్కువ ధరకే విమాన టికెట్లను అందిస్తోంది. ప్రారంభ ధర రూ.899 టికెట్‌ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద 10 లక్షల సీట్లను కేటాయించినట్లు ఇండిగో ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.

ఆఫర్ మూడు రోజుల మాత్రమే.. 
ఇండిగో ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ అక్టోబరు 24 నుంచి అక్టోబరు 26 వరకు మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ వ్యవధిలో టికెట్ బుక్ చేసుకుంటే ఈ ఆఫర్ ప్రకారం తక్కువ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు. ప్రారంభ ధర రూ.899కే టికెట్‌ ఈ ఏడాది నవంబరు 8 నుంచి 2019 ఏప్రిల్‌ 15 వరకు ఈ ఆఫర్‌ కింద ప్రయాణాలు చేయొచ్చు అని ఇండిగో తన ప్రకటనలో తెలిపింది.

ఇండిగో షరతులు ఇవే.. 
దీపావళి బంపర్ ఆఫర్ ప్రకటించిన ఇండియాగో పలు షరతులు విధించింది. ఇండిగో ప్రయాణించే 64 గమ్యస్థానాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకుంటే నగదు తిరిగి ఇవ్వడం జరగదని ఇండిగో ప్రతినిధి పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు ఛార్జీలు, ప్రభుత్వ పన్నుల మీద ఎటువంటి రాయితీ ఉండబోదని ఇండిగో వెల్లడించింది. దీపావళి ఆఫర్ కింద టికెట్ బుక్ చేయదల్చుకున్నావారు.. ఇండిగో వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com