చైనాలో విఫలమైన తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం
- October 28, 2018
బీజింగ్: చైనాలో తొలిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ చేపట్టిన రాకెట్ ప్రయోగం విఫలమైంది. బీజింగ్‌కు చెందిన లాండ్‌స్పేస్ అనే సంస్థ అంతరిక్షంలోకి రాకెట్‌ను పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రాకెట్ ద్వారా చైనాకు చెందిన సీసీటీవీ ప్రసారాల కోసం ఓ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టాలనుకుంది.
శనివారం రాత్రి ఝూక్యూ-1 రాకెట్ ప్రయోగాన్ని ఆ సంస్థ చేపట్టింది. అయితే రాకెట్ మొదటి రెండు దశల్లో సవ్యంగానే వెళ్లగా.. మూడో దశలో విఫలమైనట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. చైనాలో ఓ ప్రైవేట్ సంస్థ చేపట్టిన మూడు దశల తొలి వాణిజ్య రాకెట్ ప్రయోగమిదే. 19 మీటర్ల పొడవున్న ఈ రాకెట్ ప్రయోగాన్ని శనివారం గన్సు ప్రాంతంలోని జియుకాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ప్రయోగించారు. ఈ ప్రయోగంపై లాండ్‌స్పేస్ కంపెనీ స్పందిస్తూ.. రెండో దశ అనంతరం అసాధారణ పరిస్థితులు తలెత్తి ప్రయోగం విఫలమైందని పేర్కొంది.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి









