అమెరికాలో యూదులపై కాల్పులు.. 11 మంది మృతి

- October 28, 2018 , by Maagulf
అమెరికాలో యూదులపై కాల్పులు.. 11 మంది మృతి

అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో శనివారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. యూదుల ప్రార్థనా మందిరం వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందారు. ఆరుగురు గాయపడ్డారు. దుండగుడు సెమీఆటోమెటిక్‌ రైఫిల్‌తో కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని నిందితునిపై ఎదురుకాల్పులు జరిపారు. గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పుల్లో నలుగురు పోలీసులు కూడా గాయపడ్డారు. కాల్పులు జరిపినపుడు 'యూదులందరూ చనిపోవాల్సిందే' అని నిందితుడు నినాదాలు చేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com