యూఏఈ తొలి శాటిలైట్ నింగిలోకి..!
- October 28, 2018
యూఏఈ:చారిత్రక ఘట్టానికి సర్వం సిద్ధమయ్యింది. జపాన్‌లోని తనెగాషిమా దీవి నుంచి యూఏఈ తొలి శాటిలైట్ 'ఖలీఫా శాట్'ని నింగిలోకి పంపుతున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని అందరూ వీక్షించేందుకోసం లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు. యూఏఈ టైమింగ్ ఉదయం 8 గంటల నుంచి ఇది ప్రత్యక్ష ప్రసారం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించబోతున్నారు. ఖలీఫా శాట్‌ని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఎర్త్ అబ్జర్వింగ్ శాటిలైట్‌గా అభివర్ణిస్తున్న సంగతి తెల్సిందే. మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (ఎంబిఆర్‌ఎస్‌సి) ఈ లైవ్ స్ట్రీమింగ్కి ఏర్పాట్లు చేసింది. ఖలీపా శాటిలైట్, హై క్వాలిటీ ఇమేజెస్‌ని అందించనుంది. సుమారు 70 మంది శాస్త్రవేత్తలు ఈ శాటిలైట్ తయారీలో కీలక భూమిక పోషించారు. వీరిలో 10 మంది జపాన్‌కి వెళ్ళి అక్కడినుంచి శాటిలైట్ లాంచ్‌ని పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







