దుబాయ్ గ్లోబల్ విలేజ్ న్యూ సీజన్ రేపే ప్రారంభం
- October 28, 2018
దుబాయ్:గ్లోబల్ విలేజ్‌లో సరికొత్త సీజన్ రేపటినుంచి ప్రారంభం కాబోతోంది. 23వ సీజన్లో అనేక ప్రత్యేకతలున్నాయి. అడ్వెంచర్స్, కుటుంబ సమేతంగా ఎంటర్టైన్మెంట్ వంటివి గ్లోబల్ విలేజ్‌లో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు గ్లోబల్ విలేజ్ సీఈఓ బదర్ అన్వాహి పేర్కొన్నారు. ఎక్స్ప్లోర్, ఎక్స్పీరియన్స్, ఎంజాయ్.. అనేలా 159 రోజులపాటు ఈ సీజన్ గ్రాండ్‌గా జరగనునందని చెప్పారాయన. ఈ ఏడాది 27 పెవిలియన్లు, 78 దేశాల ప్రాతినిథ్యంతో గ్లోబల్ విలేజ్ సందర్శకుల్ని అలరించనుంది. యూఏఈ, సౌదీ అరేబియా, ఇండియా, జోర్డాన్, పాకిస్తాన్, యూరోప్, అమెరికాస్, బోస్నియా మరియు బల్కాన్స్, థాయిలాండ్, బహ్రెయిన్, లెబనాన్, పాలస్తీన్, ఆఫ్గనిస్తాన్, సిరియా, రష్యా, జపాన్, ఫార్ ఈస్ట్, చైనా, ఆఫ్రికా, ఈజిప్ట్, మొరాకో, టర్కీ, ఇరాన్, యెమెన్, కువైట్ తదితర దేశాలు గ్లోబల్ విలేజ్ ఈవెంట్లో పాల్గొంటున్నాయి. ఆయా దేశాల పెవిలియన్లు, సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించనున్నాయి. వ్యాట్ తకలిపి ఎంట్రీ టిక్కెట్ 15 దిర్హామ్‌లు. 3 ఏళ్ళలోపు పిల్లలు, పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ (ఒక సహాయకుడితోపాటు) అలాగే 65 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్స్‌కి ప్రవేశం ఉచితం. 20,000కి పైగా కల్చరల్ మరియు ఎంటర్టైన్మెంట్ షోస్, 3,500కి పైగా రిటెయిల్ ఔట్లెట్స్, 12 రిటెయిల్ షాప్స్‌తో గ్లోబల్ విలేజ్ ఆకర్షణీయంగా మారనుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!