కొత్త చట్టం తెచ్చిన ఖతార్, వలస కార్మికులకు స్వేచ్ఛ.!

- October 28, 2018 , by Maagulf
కొత్త చట్టం తెచ్చిన ఖతార్, వలస కార్మికులకు స్వేచ్ఛ.!

ఖతార్: ఏండ్ల తరబడి వలస కార్మికులు ఎదురుచూస్తున్న రిటర్న్ వీసా నిబంధనల్లో ఖతార్ భారీ మార్పులు చేసింది. ఇకపై ఆ దేశంలో పనిచేస్తున్న కార్మికులు తమ స్వదేశానికి వెళ్లడానికి యజమాని అనుమతి పొందాల్సిన అవసరం లేకుండా కొత్త చట్టాన్ని తెచ్చింది. ఇప్పటి వరకు ఖతార్‌లో పనిచేస్తున్న కార్మికులు తమ స్వదేశానికి వెళ్లాలంటే యజమాని అనుమతి తీసుకోవాలి. ఆ యజమాని అనుమతించక చాలా మంది కార్మికులు అక్కడే ఉండిపోవాల్సి వస్తున్నది. ఈ నిబంధనను తొలిగించాలని ఏండ్ల తరబడి చేస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న ఖతార్ ప్రభుత్వం ఎట్టకేలకు నిబంధనను తొలిగించింది. ఓ కంపెనీలోని కార్మికుల్లో కీలక స్థానాల్లో ఉన్న 5శాతం మంది మాత్రం యజమాని అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్న నిబంధనను విధించింది. ఒకవేళ కార్మికుడు స్వదేశానికి వెళ్లకుండా కంపెనీ యజమాని అడ్డుపడితే ఫిర్యాదు చేయవచ్చని, ఆ ఫిర్యాదుపై మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఖతార్ పేర్కొంది. ఖతార్‌లో దాదాపు 20 లక్షల మంది విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఆసియా నుంచి అందులోనూ భారతీయులే అధికం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com