కొత్త చట్టం తెచ్చిన ఖతార్, వలస కార్మికులకు స్వేచ్ఛ.!
- October 28, 2018
ఖతార్: ఏండ్ల తరబడి వలస కార్మికులు ఎదురుచూస్తున్న రిటర్న్ వీసా నిబంధనల్లో ఖతార్ భారీ మార్పులు చేసింది. ఇకపై ఆ దేశంలో పనిచేస్తున్న కార్మికులు తమ స్వదేశానికి వెళ్లడానికి యజమాని అనుమతి పొందాల్సిన అవసరం లేకుండా కొత్త చట్టాన్ని తెచ్చింది. ఇప్పటి వరకు ఖతార్‌లో పనిచేస్తున్న కార్మికులు తమ స్వదేశానికి వెళ్లాలంటే యజమాని అనుమతి తీసుకోవాలి. ఆ యజమాని అనుమతించక చాలా మంది కార్మికులు అక్కడే ఉండిపోవాల్సి వస్తున్నది. ఈ నిబంధనను తొలిగించాలని ఏండ్ల తరబడి చేస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న ఖతార్ ప్రభుత్వం ఎట్టకేలకు నిబంధనను తొలిగించింది. ఓ కంపెనీలోని కార్మికుల్లో కీలక స్థానాల్లో ఉన్న 5శాతం మంది మాత్రం యజమాని అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్న నిబంధనను విధించింది. ఒకవేళ కార్మికుడు స్వదేశానికి వెళ్లకుండా కంపెనీ యజమాని అడ్డుపడితే ఫిర్యాదు చేయవచ్చని, ఆ ఫిర్యాదుపై మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఖతార్ పేర్కొంది. ఖతార్‌లో దాదాపు 20 లక్షల మంది విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఆసియా నుంచి అందులోనూ భారతీయులే అధికం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







