మోడీకి వ్యతిరేకంగా సోదరుడు ప్రచారం...!
- October 31, 2018
కోల్‌కతా: ప్రధాని నరేంద్రమోదీకి ఇంటి సెగ మొదలైంది. సొంత సోదరుడు ప్రహ్లాద్ మోదీ నుంచి నరేంద్ర మోదీకి వ్యతిరేకత మొదలైంది. ప్రస్తుతం రేషన్ డీలర్ల జాతీయ సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్న ప్రహ్లాద్ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ తృణమూల్ పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది.
అయితే బీజేపీ ప్రభుత్వానికి తొలుత మద్దతు ఇచ్చిన ప్రహ్లాద్ మోదీ క్రమంగా ఆ పార్టీపై అసమ్మతి గళాన్ని వినిపించడం మొదలుపెట్టారు. నకిలీ డిగ్రీ పొందినట్లు కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని ఆయన అప్పట్లో డిమాండ్ చేశారు. ఇటీవలే జరిగిన ఓ ఆందోళన కార్యక్రమంలో ప్రహ్లాద్ పాల్గొని సంచలనం సృష్టించారు. కానీ తాను అన్నయ్య (మోడీ)కి వ్యతిరేకం కాదని..కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం మాత్రమేనని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







