రోడ్డు ప్రమాద బాధితుడికి ఎంబసీ సాయం
- November 02, 2018
అబుదాబీ:అబుదాబీలో ఇండియన్ ఎంబసీ అధికారులు, రోడ్డు ప్రమాదం కారణంగా తీవ్ర గాయాల పాలై కదల్లేని స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఖాదెర్ మొహమ్మద్ అద్నాన్ అనే కేరళ వాసికి అండగా నిలిచారు. సెప్టెంబర్ 29 నుంచి అద్నాన్ ముఫ్రాక్ హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతున్నాడు. కదల్లేని పరిస్థితుల్లో వున్న అద్నాన్, అమ్నెస్టీని వినియోగించుకోవడమెలాగో తెలియక ఆందోళన చెందుతుండగా, అతనికి ఎంబసీ అండగా నిలిచింది. ఇండియన్ ఎంబసీ నుంచి తొలుత ఫోన్ రాగానే ఆశ్చర్యపోయానని ఎంబసీ అధికారులు కలిసిన అనంతరం అద్నాన్ చెప్పాడు. ఎంబసీ, తనకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చిందనీ, అలాగే ఇండియాకి వెళ్ళేందుకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపిందని అన్నాడు అద్నాన్. రోడ్డు ప్రమాదం కారణంగా అద్నాన్కి పలు రకాలైన శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగిందనీ, శరీరంలో కొన్ని చోట్ల స్టీల్ రాడ్స్ అమర్చామనీ వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







