దుబాయ్‌లో ప్రతి ఇద్దరికీ ఓ కారు!
- November 02, 2018
దుబాయ్:పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పట్ల ఎంతలా అవగాహన పెరుగుతున్నా, దుబాయ్‌లో సొంత కార్ల వినియోగం కూడా తగ్గడంలేదు. రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం, ఎమిరేట్‌లో వెహికిల్ డెన్సిటీ ప్రపంచంలో టాప్ లిస్ట్‌లో స్థానం దక్కించుకుంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి దుబాయ్‌లో కారు వున్నట్లు తెలుస్తోంది. వెయ్యి మందిలో 540 వెహికిల్స్ వున్నట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. న్యూయార్క్, లండన్, సింగపూర్ మరియు ఖాంగ్ కాంగ్‌లలో ఈ సంఖ్య 305, 2013, 101, 63 వాహనాలుగా మాత్రమే వుంది. 2006 గణాంకాల ప్రకారం దుబాయ్‌లో వాహనాల సంఖ్య 740,000 కాగా, 2014 నాటికి అది 1.4 మిలియన్‌కి చేరుకుంది. ప్రతిరోజూ ఎమిరేట్‌లోకి ఇతర ఎమిరేట్స్ నుంచి వస్తున్న వాహనాల సంఖ్య దాదాపుగా 450,000 వరకు వుందంటే ఆశ్చర్యకరమే మరి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







