ఓటరు నమోదుకు ఇక ఐదు రోజులే గడువు
- November 05, 2018
తెలంగాణ:ఓటరు నమోదుకు ఇంకా ఐదు రోజులే మాత్రమే గడువు ఉంది. నవంబర్ 9వ తేదీన ఓటరు నమోదుకు చివరి తేదీగా ప్రకటించారు. 2018 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఒక వేళ ఓటరుగా నమోదు కాకుంటే వెంటనే సమీపంలోని వార్డు కార్యాలయం, గ్రామ పంచాయితీ, బూత్‌లెవల్ ఆఫీసర్ వద్ద ఫారం-6ని తీసుకొని ఓటరుగా నమోదు చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో 2018 డిసెంబర్ 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈ ఎన్నికలలో ఓటు వేయాలంటే ఈ నెల 9వ తేదీలోపు ఓటరుగా నమోదై ఉండాలి. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకుని డిసెంబర్ 7న జరిగే ఓటింగ్‌లో పాల్గొనాలని ఎన్నికల అధికారులు సూచించారు. కార్డు ఉన్నప్పటికీ తుది జాబితాలో ఓటులేని వ్యక్తులు కూడా ఫారం-6 ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







