టీఆర్ఎస్ అభ్యర్థులకు అడుగడునా అడ్డంకులు
- November 05, 2018
తెలంగాణ:ఎన్నికల ప్రచారానికి వెళ్తోన్న అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలకు నిరసన సెగలు వెంటాడుతున్నాయి… ప్రచారంలో భాగంగా క్షేత్రస్థాయికి వెళ్లిన అభ్యర్థులను ఓటర్లు నిలదీస్తున్నారు. దీంతో ప్రచారానికి వెళ్లిన నేతలు వారితో వాగ్వాదానికి దిగి వారికి సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
బోధన్ నియోజకవర్గంలో గ్రామస్థులు వినూత్న నిరసన తెలిపారు. ఎడపల్లి మండలం అలీసాగర్‌లో గత కొంతకాలంగా ప్రధాన రోడ్డు పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రోడ్డు పనులు పూర్తి చేశాకే తమ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేపట్టాలని గ్రామస్థులు హెచ్చరించారు. ప్రచారానికి వెళ్లిన అధికార టీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది….
నిజామాబాద్ జిల్లా మద్నూర్‌లో టీఆర్ఎస్ జుక్కల్ అభ్యర్థి హన్మంత షిండే ప్రచారాన్ని స్థానికులు అడ్డుకున్నారు. తాగు నీటి సమస్యను తీర్చాలంటూ ఖాళీ బిందెలతో రోడ్డుపై మహిళలు బైఠాయించారు.
తాగునీరివ్వలేని టీఆర్ఎస్ కు ఓటు వేసేది లేదని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అల్లమియా గుట్టకాలనీ వాసులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కోరుట్ల ఎమ్మెల్యేని ఎన్నిసార్లు గెలిపించినా తమకు ఒరింగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!









