బ్యాడ్ వెదర్: యూఏఈ రోడ్స్‌పై స్పీడ్స్ లిమిట్స్ తగ్గింపు
- November 07, 2018
ట్రాఫిక్ సేఫ్టీ కమిటీ, అబుదాబీ రోడ్లు అలాగే హైవేస్‌పై స్పీడ్ లిమిట్‌ని తగ్గించేలా స్మార్ట్ ఇంటెలిజెంట్ సిస్టమ్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు ప్రకటించింది. వాతావరణంలో మార్పుల కారణంగా, విజిబిలిటీ తగ్గినందున స్పీడ్ లిమిట్స్ తగ్గిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విజిబిలిటీ 200 మీటర్ల కంటే తగ్గినప్పుడు, రోడ్లపై స్పీడ్ లిమిట్ గంటకు 80 కిలోమీటర్లకు తగ్గించబడ్తుంది. ప్రమాదాలు జరిగే అవకాశం వున్నందు, భద్రతను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ - అబుదాబీ ఈ విషయాన్ని వెల్లడించింది. మార్పు చేసిన స్పీడ్ లిమిట్స్, షేక్ రషీద్ బిన్ సయీద్ స్ట్రీట్, షేక్ ఖలీఫా స్ట్రీట్‌పై వున్న స్మార్ట్ టవర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అన్ని వాహనాలూ, ప్రకటించిన స్పీడ్ లిమిట్స్‌ని పాటించాల్సి వుంటుంది. విజిబిలిటీ సాధరణ స్థాయికి వచ్చేవరకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







