స్మగ్లింగ్ యత్నం: వలసదారుడికి జైలు
- November 08, 2018బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్టు, బంగ్లాదేశీ జాతీయుడొకరికి 10 ఏళ్ళ జైలు శిక్ష, 5,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణల నేపథ్యంలో నిందితుడికి న్యాయస్థానం ఈ శిక్షలు ఖరారు చేసింది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో నిందితుడ్ని అరెస్ట్ చేసిన అధికారులు, అతని నుంచి కిలోగ్రామ్ మరిజువానా, 900 నార్కోటిక్ పిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరిజువానాని స్మోక్ చేసేందుకు ఉపయోగించే ఓ వుడెన్ టూల్‌ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైలు శిక్ష పూర్తయిన అనంతరం నిందితుడ్ని దేశం నుంచి బహిష్కరిస్తారు. ఇటీవల తన దేశానికి వెళ్ళిన తాను అక్కడ ఐదు రోజులు వున్నాననీ, అక్కడే మరిజువానాని స్మోక్ చేశాననీ, అక్కడ తనను కలిసిన ఓ వ్యక్తి, డ్రగ్స్‌ని తీసుకెళ్ళాల్సిందిగా కోరుతూ, 200 బహ్రెయినీ దినార్స్ ఇచ్చాడని విచారణలో నిందితుడు పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు