డ్రాగ్‌ అండ్‌ డ్రిఫ్ట్‌ నైట్‌కి రంగం సిద్ధం

- November 24, 2018 , by Maagulf
డ్రాగ్‌ అండ్‌ డ్రిఫ్ట్‌ నైట్‌కి రంగం సిద్ధం

బహ్రెయిన్:ఆదివారం బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌ వద్ద ఇబ్రహీమమ్‌ కె కానూ డ్రాగ్‌ అండ్‌ డ్రిఫ్ట్‌ నైట్‌ జరగనుంది. మోటర్‌ స్పోర్ట్‌ అభిమానులు, ఈ వేడుక కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తొలిసారిగా ఈ వేడుకని ఆదివారం నిర్వహిస్తున్నారు. పార్టిసిపెంట్స్‌ తమ సొంత కారు లేదా మోటార్‌ బైక్‌తో ఈ ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం వుంది. బహ్రెయిన్‌కి చెందిన వరల్డ్‌ క్లాస్‌ క్వార్టర్‌ మైల్‌ డ్రాగ్‌ స్ట్రిప్‌, నేషనల్‌ హాట్‌ రెడ్‌ అసోసియేషన్‌ వరల్డ్‌ వైడ్‌ నెట్‌వర్క్‌లో భాగస్వామి. బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌ కార్‌ పార్క్‌ నంబర్‌ ఫైవ్‌ వద్ద డ్రిఫ్టింగ్‌ కోర్స్‌ కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com