వీకెండ్ కాన్సర్ట్ వద్ద అభిమానుల ఆందోళన
- November 24, 2018
అబుధాబి:వీకెండ్ ఎఫ్1 వన్ కాన్సెర్ట్ అభిమానులు డు ఎరీనా వద్ద ఆందోళన చేశారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బందిని తోసేసి, గేట్లను ధ్వంసం చేశారు. రాత్రి 9.30 నిమిషాల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. గేట్లను ఓపెన్ చేయాల్సిందిగా అభ్యర్థించిన ఆందోళనకారులు, చివరికి సంయమనం కోల్పోయారు. టిక్కెట్ల కొనుక్కున్న తమను సెక్యూరిటీ సిబ్బంది అడ్డగించారని దుబాయ్ రెసిడెంట్ అయిన అలీసా ఆవేదన వ్యక్తం చేశారు. ఐరిష్ వలసదారుడు మాట్లాడుతూ, తన భార్య, మరికొందరు స్నేహితులతో కలిసి టిక్కెట్లు కొన్నప్పటికీ తమను అనుమతించలేదని ఆరోపించారు. యూకేకి చెందిన టూరిస్ట్ ఒకరు 400 పౌండ్లు వెచ్చించి టిక్కెట్ కొనుగోలు చేశాననీ, అయినా తమకు అనుమతివ్వలేదనీ, ఇది చాలా బాధకరమని అన్నారు. అయితే డు అరెనీ గ్రౌండ్ కంప్లీట్‌గా ప్యాక్డ్ అయిపోవడంతోనే నిర్వాహకుల ఆదేశంతో మిగిలినవారిని అనుమతించలేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. డు ఎరీనా కెపాసిటీ 35,000 కాగా, అంతకు మించి టిక్కెట్లు విక్రయించారనే ఆరోపణలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







