లేహంగాలో మెరిసిపోతున్న ఇషా అంబానీ!
- November 28, 2018
ముంబై:పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్ళి సందడి అప్పుడే మెుదలైంది. వివాహ వేడుకలో ఇషా ధరంచాల్సిన డ్రెస్స్స్ను సెలబ్రిటీ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేస్తున్నారు. తాజాగా అతను డిజైన్ చేసిన లెహెంగా దుస్తులను ధరించి ఇషా మెరిసిపోయింది. ఆమె ధరించిన లెహంగ దుస్తులతో ఉన్న ఫోటోను సవ్యసాచి ముఖర్జీ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లెహంగతో పాటు అన్‌కట్ సిండికేట్ డైమండ్స్, జాంబియన్ ఎమరాల్డ్స్ పొదిగిన నెక్లెస్‌ను ధరించి ఇషా తళుక్కున మెరిసిపొతుంది. పోస్ట్ చేసిన గంటలోనే ఆ ఫోటోకు90వేల లైక్స్ లభించాయి. ఫోటోతో పాటు సవ్యసాచి కాప్షన్ కూడా జతచేశారు” వివాహానికి ముందు జరిగే గ్రహ శాంతి పూజా కోసం ఈ డ్రెస్ డిజైన్ చేశాము. డిసెంబరు 12న వివాహ కార్యక్రమం జరగనుంది. లేహంగ దుస్తులు, ఖరీదైన అన్‌కట్ సిండికేట్ డైమండ్స్, జాంబియన్ ఎమరాల్డ్స్ పొదిగిన నెక్లెస్, దానికి జతగా మ్యాచింగ్ చెవి రింగులతో ఇషా తళుక్కున మెరిసిందన్నారు. ఈ ఫోటోకు తమదైన శైలిలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. “చూడాదల్సిన అందాలు అన్నీ ఒక్కే వ్యక్తి”లో ఉన్నట్లు ఉందని ఓ నేటిజెన్ కామెంట్ చేయగా “ఈ దుస్తులలో ఇషా.. దీపిక కంటే అందంగా ఉంది” అంటూ మరొక యూజర్ కామెంట్ చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







