తెలంగాణ లో రాహుల్,చంద్రబాబుల బహిరంగ సభ

- November 28, 2018 , by Maagulf
తెలంగాణ లో రాహుల్,చంద్రబాబుల బహిరంగ సభ

ఖమ్మం సభలో కేంద్రంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.. అంతేకాదు దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. జీఎస్టీ సరిగా అమలుకాకపోవడంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందిని ఆవేదన వ్యక్తం చేశారు..

దేశంలోని ఎన్డీఏకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. ఇందులో భాగంగానే టీడీపీ – కాంగ్రెస్‌లు కలిశాయని గుర్తు చేశారు. ఈ రెండు పార్టీల కలయిక చారిత్రక అవసరం అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే నూతన చరిత్రకు ఈ కలయిక శ్రీకారం చుట్టినట్టు అర్థమవుతోందన్నారు చంద్రబాబు.

కేసీఆర్‌ తనను ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ విమర్శించాలి అంటే సభ్యత్వం అడ్డువస్తుందన్నారు. అసలు తెలుగుదేశం పార్టీ లేకుంటే.. కేసీఆర్‌ ఉండేవారా అని చంద్రబాబు ప్రశ్నించారు. తాను హైదరాబాద్‌ను కట్టించినట్టు ఎప్పుడూ చెప్పలేదని.. కేవలం సైబరాబాద్‌కు రూపకల్పన చేసినట్టు మాత్రమే చెప్పాను అన్నారు చంద్రబాబు.

ఎక్కడ ఉన్నా తనకు తెలంగాణ ఇష్టమైన ప్రాంతం అన్నారు చంద్రబాబు. అయితే కేసీఆర్‌ ఆరోపించినట్టు తెలంగాణకు వచ్చి తాను పోటీ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల హితం కోసమే తాను కష్టపడతానని.. ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాని చెప్పడం సరైంది కాదన్నారు చంద్రబాబు.

ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారి జై తెలంగాణ అన్నారు. ప్రజలతో జై జై తెలంగాణ అని నినాదాలు చేయించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన ప్రజా కూటమిని తెలంగాణ ప్రజలు గెలిపించాలని.. ఓట్లతో కేసీఆర్‌కు బుద్ది చెప్పాలని పిలుపు ఇచ్చారు.

ఖమ్మం సభకు వచ్చిన స్పందన చూస్తుంటే ప్రజా కూటమి విజయం కాయమైనట్టు అర్థమవుతోంది అన్నారు చంద్రబాబు. కేసీఆర్‌ నియంతృత్వ పాలనకు స్వాగతం పలకాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజా కూటమి నూటికి వెయ్యిశాతం గెలిచి తీరుతుందన్నారు చంద్రబాబు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com