సినీ నటి ఆత్మహత్య
- November 29, 2018సినీ నటి రియామికా ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు ఆమె సోదరుడు తెలిపారు. చెన్నై సమీపంలోని శ్రీదేవికి కుప్పానికి చెందిన రియామిక, తన సోదరుడు ప్రకాశ్‌తో కలిసి గత నాలుగు నెలలుగా వలసారవాకంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. ఉన్నత చదువులు చదివిన ఆమె సినిమాలపై ఆసక్తితో సినీరంగంవైపు వచ్చారు. దాంతో కుద్రతైల్ కుమారాం కొందత్తం, అఘోరి యనిట్టం ఆరంభం వంటి పలు తమిళ చిత్రాల్లో కథానాయికిగా నటించారు. బుధవారం సాయంత్రం సోదరుడు ప్రకాశ్ ఇంటికి చేరుకునేసరికి లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో బలవంతంగా తలుపు తెరిచి చూడగా రియామిక తన బెడ్రూమ్లో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. భయాందోళన చెందిన ప్రకాష్ వెంటనే ఇతర కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం