12 వేల వెబ్‌సైట్స్ బ్లాక్..!!

12 వేల వెబ్‌సైట్స్ బ్లాక్..!!

చెన్నై:రిలీజ్ కంటే ముందే ఎంత పెద్ద సినిమా అయినా సోషల్ మీడియాలో లీకైపోతుంది. నిమిషాల్లో పైరసీగా మార్చేస్తున్నారు. వెబ్‌సైట్స్‌లో అప్ లోడ్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ దాదాపు 500 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన రజనీకాంత్ 2.0 చిత్రాన్ని కూడా ఎక్కడ చోరీ చేస్తారోనని ముందుగా చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ హై కోర్టులో పిటీషన్ వేసింది. పైరసీ భూతం చిత్ర యూనిట్‌ని భయాందోళనకు గురిచేస్తోంది.

పిటీషన్‌ని స్వీకరించిన జస్టిస్ ఎం సుందర్ పైరసీ చేస్తున్న 12000 వెబ్‌సైట్స్‌ని బ్లాక్ చేయమని 37 ఇంటర్నెట్ ప్రొవైడర్లకి ఆదేశించారు. దీనిలో 2,000 కంటే ఎక్కువ వెబ్ సైట్స్ తమిళ్ రాకర్స్ చేత నిర్వహించబడుతున్నాయి. రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన 2.0 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పది వేలకి పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంశలందుకుంది.

Back to Top