యూఏఈ - ముంబై మధ్య అండర్‌ వాటర్‌ రైల్‌ ట్రావెల్‌.?

- November 29, 2018 , by Maagulf
యూఏఈ - ముంబై మధ్య అండర్‌ వాటర్‌ రైల్‌ ట్రావెల్‌.?

ఇన్నోవేషన్స్‌కి పెట్టింది పేరుగా యూఏఈలో అనేక ఆవిష్కరణలు ఇటీవల ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెల్సిందే. హైపర్‌లూప్‌ ప్రాజెక్ట్‌, ఫ్లయ్యింగ్‌ కార్స్‌ విషయంలో యూఏఈ అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. ఈ నేపథ్యంలో యూఏఈ నుంచి మరో అద్భుతం సాక్షాత్కారమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతానికి ప్రతిపాదనల దశలోనే వున్నా, ఈ ప్రాజెక్ట్‌కి తుది రూపు వస్తే అది ఓ అద్భుతమే కాబోతోంది. భారతదేశంలోని ముంబైనీ, యూఏఈలోని ఫుజారియానీ కలిపే అండర్‌ వాటర్‌ రైల్‌ నెట్‌ వర్క్‌ దిశగా ఓ ఆలోచన తెరపైకొచ్చింది. నేషనల్‌ అడ్వయిసర్‌ బ్యూరో లిమిటెడ్‌ - మస్దార్‌ - ఫౌండర్‌ అలషెహ్హి ఈ ఆలోచన చేశారు. ఈ ప్రాజెక్ట్‌ గనుక వాస్తవ రూపం దాల్చితే, ఇండియా - యూఏఈతో పాటు పలు దేశాలకు ఎంతో లబ్ది చేకూర్చుతుందని అన్నారాయన. ఇది ప్రస్తుతానికి ఓ కాన్సెప్ట్‌ మాత్రమేనని ఆయన అంటున్నారు. ప్రయాణీకుల రవాణా కోసమే కాక, సరుకు రవాణా కోసం కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఫీజిబిలిటీ స్టడీ చేపట్టవలసి వుంది. రష్యా, కెనడా, అమెరికాతో కనెక్ట్‌ అవడానికి చైనా ఇలాంటి ఆలోచనలే చేస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com