ఇండియా:నేటి నుంచి రాత్రివేళల్లో చౌకగా ఎయిర్ ఇండియా విమాన టిక్కెట్లు
- November 29, 2018
న్యూఢిల్లీ: నేటి అర్ధరాత్రి నుంచి ఎయిర్ ఇండియా 'లేట్ నైట్ ఫ్లైట్' సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో సాధారణ సమయాల్లోని విమానయాన సేవల కంటే ఇవి చౌకగా అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలను బెంగళూరు-అహ్మదాబాద్ - బెంగళూరు, ఢిల్లీ- కోయంబత్తూరు-ఢిల్లీ, ఢిల్లీ-గోవా-ఢిల్లీ మార్గాల్లో తొలుత ప్రారంభిస్తోంది. ఈ సర్వీసుల టిక్కెటు ధరలు రూ.1,000 నుంచి మొదలు కానున్నాయి. వీటిని రెడ్‌ఐ విమాన సేవలు అనికూడా అంటారు. హోటల్ రూముల ఖర్చు తగ్గించేందుకు, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ సేవలను ప్రారంభించింది. ఐరోపాలో ఈ సేవలకు బాగా ఆదరణ ఉంది.
సర్వీసులు...
* ఏఐ589 విమానం అర్ధరాత్రి 12.30 గంటలకు బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు బయల్దేరి 2.35గంటలకు చేరుకొంటుంది. అక్కడ ఏఐ590 విమానం రాత్రి 3.05కు బయల్దేరి తెల్లవారుజామున 5.25కు చేరుకుంటుంది. 15రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. టిక్కెట్ బేస్ ధర రూ.1000 నుంచి మొదలవుతుంది.
* ఏఐ547 విమానం దిల్లీలో రాత్రి 9.15కు ప్రయాణం మొదలుపెట్టి రాత్రి 12.30కు కోయంబత్తూరుకు చేరుతుంది. అక్కడి నుంచి ఏఐ548 విమానం ఒంటిగంటకు బయల్దేరి తెల్లవారుజామున 4గంటలకు ఢిల్లీ చేరుకొంటుంది. ఈ ప్రయాణం టిక్కెట్ బేస్ ధర రూ.2,500
* ఏఐ883 విమానం రాత్రి 10గంటలకు ఢిల్లీలో బయల్దేరి 12.35కు గోవా చేరుకుంటుంది. అక్కడి నుంచి ఏఐ884 విమానం 1.15కు బయల్దేరి 3.40కు ఢిల్లీకి చేరుకొంటుంది. ఈ ప్రయాణం టిక్కెట్ ధర రూ.3,000. ఢిల్లీ-గోవా మార్గంలో ఎయిర్ ఇండియా ఒక్క సర్వీసు మాత్రమే నడుపుతోంది. ఇప్పుడు దీనికి అదనంగా నైట్ ఫ్లైట్ సర్వీసు విమానం కూడా చేరుతోంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







