చమురు, సహజ వాయువు రంగాలలో ఉద్యోగుల తగ్గింపు పై ఆరా తీస్తున్న ఒమాన్ ప్రభుత్వం
- December 23, 2015
ఒప్పంద ఉద్యోగుల కాల పరిమితి ముగియుడమో లేక చమురు, సహజ వాయువు రంగాలలో పని లేకపోవడమో అనే విషయం పై ఉద్యోగుల తగ్గింపు ఎందుకు చేయాల్సి వచ్చిందనే అంశంపై ఒమాన్ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇటీవల సామాజిక మీడియా లో చమురు, సహజ వాయువు రంగాలలో ఉద్యోగుల తగ్గింపుసంఖ్యను ఎంతో అధికంగా చూపిస్తున్నారని , అయితే ఈ సంఖ్య చాల తక్కువని చమురు, సహజ వాయువు మంత్రిత్వ శాఖఉప కార్యదర్శి సలీం బిన్ నస్సేర్ అల్ ఆఫి తెలిపారు. గత వారంలో తాము ఇదే విషయంపై ఒక సమావేశం నిర్వహించి వాస్తవ సంఖ్యను తెలుసుకొనే ప్రయత్నం చేసినట్లు ఆయన చెప్పారు. కేవలం 20 నుంచి 30 లోపు ఉద్యోగులను మాత్రమె వారుతొలిగిస్తున్నట్లు తెలిసిందన్నారు. వాస్తవానికి , ఖతర్ లో అనేక ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వేరే అవకాశాలులేనివారు వాటిని అన్వేషించుకోవచ్చుని వివరిస్తూ , చమురు, సహజ వాయువు రంగాలలోనే పనిచేస్తామని భీష్మించుకోకుండా,మరో రంగానికి నిర్భయంగా వెళ్ళవచ్చని సూచించారు. ఒక ప్రశ్నకు అయన జవాబిస్తూ , ఒమాన్ ప్రబుత్వం కాక ఉద్యోగుల తొలిగింపు అనివార్యమైతే , సంబందిత రంగం యాజమాన్యమే ఆ ఉద్యోగికి ప్రత్యమ్నాయ అవకాశం వారే చూపాలనే నిబంధనఉందన్నారు, ఈ తొలగింపు విషయంపై తమకు ఎటువంటి పిర్యాదులు అందలేదని అన్నారు. ఇటువంటి విషయాలపై తమ శాఖనిరంతర పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. 2016 లో ఒమాన్ ప్రబుత్వం చమురు ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తున్నట్లు చమురు,సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శి సలీం బిన్ నస్సేర్ అల్ ఆఫి మరో ప్రశ్నకు జవాబిచ్చారు.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









