ఇస్తాంబుల్ విమానాశ్రయంలో పేలుడు

- December 23, 2015 , by Maagulf
ఇస్తాంబుల్ విమానాశ్రయంలో పేలుడు

టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ లో బుధవారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి... వైద్య చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. క్షతగాత్రులు ఇద్దరు ఎయిర్ పోర్ట్ ను శుభ్రం చేస్తున్న క్రమంలో ఈ పేలుడు సంభవించిందని తెలిపారు. ఈ పేలుడు ఆర్థరాత్రి 2.00 గంటల ప్రాంతంలో పేలిందని పేర్కొన్నారు. ఈ పేలుడు కూతవేటు దూరంలో విమానం ఆగి ఉందన్నారు. అయితే ఈ పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని... దీనిపై దర్యాప్తునకు ఆదేశించామని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com