లగడపాటి సర్వే: ప్రజానాడి కాంగ్రెస్ వైపే ..హంగ్ రావచ్చని జోస్యం
- December 05, 2018
తెలంగాణలో ప్రస్తుతం ప్రజానాడి కాంగ్రెస్ వైపే ఉందన్నారు మాజీ ఎంపీ లగడపాడి రాజగోపాల్. పోలింగ్ శాతం 68 కన్నా అధికంగా ఉంటే మాత్రం.. మహాకూటమికే విజయవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. పోలింగ్ శాతం తగ్గితే మాత్రం హంగ్ రావచ్చని జోస్యం చెప్పారాయన.
లగడపాటి రాజగోపాల్ ఎన్నికల సర్వే ఫలితాలు…. ఇప్పుడు తెలంగాణలో సంచలనమవుతున్నాయి. ఇప్పటికే ఇద్దరి పేర్లను ప్రకటించగా.. ఇప్పుడు .మరో ముగ్గురి పేర్లు చెప్పారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి, బెల్లంపల్లి నుంచి జి.వినోద్ గెలుస్తారని లగడపాటి పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజానాడి హస్తం పార్టీ వైపే ఉండే అవకాశం ఉందన్నారు. తాను నిర్వహించిన సర్వే వివరాలను వెల్లడించారు.
జిల్లాల వారీగా చూసినప్పుడు ఒక్కో జిల్లా ఒక్కోలా కనిపించిందన్నారు లగడపాటి. గత ఎన్నికల్లోలా పోలింగ్ 68.5 శాతం మాత్రమే నమోదు అయితేనే తన సర్వే అంచనాలు నిజమయ్యే అవకాశం ఉందని, పోలింగ్ శాతం పెరిగితే అంచనాలన్నీ తారుమారు అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉందని, ఇక కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూటమి-టీఆర్ఎస్ మధ్య పోటాపోటీ ఉందని వివరించారు
తాను వ్యక్తిగతంగా, బహిరంగంగా చెప్పినవే తన అంచనాలని స్పష్టం చేశారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదన్న లగడపాటి… ఎన్నికలపై ఉత్సాహంతోనే తాను సర్వే నిర్వంహించినట్లు తెలిపారు.
ఏయే జిల్లాలో ఎవరెవరికి బలం ఉందో చెప్పారు. బీజేపీకి గతంలో కన్నా ఎక్కువ సీట్లు దక్కుతాయని అంచనా వేశారు. ఉమ్మడి జిల్లాల ఆధారంగా సర్వే సాగినట్లు లగడపాటి తెలిపారు. హైదరాబాద్లో ఎంఐఎం ఆధిక్యంలో ఉందని, బీజేపీకి మునుపటి కంటే ఈ సారి సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. బుధవారం వరకు గడువు ఉండడంతో అవకాశం ఉంటే మరిన్ని విషయాలు చెబుతానని, 7వ తేదీ సాయంత్రం సర్వే పూర్తి వివరాలు వెల్లడిస్తానని లగడపాటి అన్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







