ఎన్నికలు అయ్యాయి, బెట్టింగులు ఊపందుకున్నాయి

- December 08, 2018 , by Maagulf
ఎన్నికలు అయ్యాయి, బెట్టింగులు ఊపందుకున్నాయి

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ రాయుళ్ళ హావా కొనసాగుతోంది.. అందులో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సర్వేలతో మరింత ఊపందుకుందని చెప్పవచ్చు.. జాతీయ సర్వేల్లో తెరాసా కు పట్టం కట్టగా, లగడపాటి కూటమికి ఆధిక్యం వస్తుందని తెలిపడం తో బెట్టింగ్ రాయుళ్ళు ధీమాగా ఉంటున్నారు.. కొన్నినియోజక వర్గాలపై మరింత జోరుగా బెట్టింగులు కొనసాగుతున్నాయి..

ముఖ్యంగా కొన్ని నియోజక వర్గాలపై బెట్టింగ్ రాయుళ్ళు ఆసక్తి చూపుతున్నారు .. హైదరాబాద్ కూకట్ పల్లి నియోజక వర్గం ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని, టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు మధ్య పోటీ ఆసక్తిగా నెలకొన్న నేపధ్యంలో ఈ నియోజక వర్గం ఫలితాలపై బెట్టింగ్ రాయుళ్ళు ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు ..

కొడంగల్ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ కీలక నేత రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేంద్ర మధ్య గట్టి పోటీ ఉండటంతో బెట్టింగ్ రాయుళ్ళు తమ చేతివాటం చూపుతున్నారు ఇలా అనేక నియోజక వర్గాలపై ఆసక్తికరంగా బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం..మరి తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానికన్నా బెట్టింగ్ పై అందరు చర్చించుకుంటున్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com