ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా
- December 08, 2018
ఇప్పటికే కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణంతో ఫేస్బుక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దాంతో పలు దేశాల్లో ఫేస్బుక్ జరిమానాలు కట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా మరో దేశం(ఇటలీ) ఫేస్బుక్ కు భారీ జరిమానా విధించింది. యూజర్ల అనుమతి లేకుండా వారి వివరాలను విక్రయిస్తోందని ఆరోపిస్తూ వినియోగదారుల భద్రత చట్టాలను ఫేస్బుక్ ఉల్లంగించినదని పేర్కొంది. దాంతో ఫేస్బుక్ కు 8.9 మిలియన్ యూరోల(ఇండియా కరెన్సీలో రూ. 70కోట్లకు పైమాటే) జరిమానా విధించింది. అయితే ఫేస్బుక్ మాత్రం తాము ఖాతాదారుల డేటాను విక్రయించలేదని వాదిస్తోంది. కాగా అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో కోట్లాది మంది ఫేస్బుక్ యూజర్లు తమ డేటా దుర్వినియోగం అయిందని ఆరోపించారు. అప్పట్లో ఫేస్బుక్ వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







