ట్రంప్ కు కోర్టులో చుక్కెదురు
- December 09, 2018
అమెరికాకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు స్థానిక కోర్టులో చుక్కెదురైంది. అమెరికాకు అక్రమ వలసలను నిరోధించే లక్ష్యంతో తీసుకొచ్చిన ఉత్తర్వులపై దిగువకోర్టుఇచ్చిన స్టేను ఎత్తివేసేందుకు 9వ యూఎస్ సర్య్కూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ నిరాకరించింది. వలసదారుల్ని నిరోధించే ఆదేశాలు అమెరికా చట్టాలకు అనుగుణంగా లేవని, అవి కాంగ్రెస్ ను విస్మరించే విధంగా ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది.
చట్టాలను అధ్యక్ష భవనం, కోర్టు గదులనుంచి చేయలేమంటూ ఘాటుగా స్పందించింది. ఒక వ్యక్తి అమెరికాలోకి ఏవిధంగా ప్రవేశించాడన్న దాని ఆధారంగా అతనిపై నిషేధం విధించడం సరికాదని వ్యాఖ్యానించింది. అమెరికా -మెక్సికో సరిహద్దునుంచి వేలాదిమంది అమెరికా ఆశ్రయం కోరుతూ దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించడంతో…. ట్రంప్ వారిని దేశంలోకి రాకుండా నిషేధించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







