కాఫీ విత్ కరణ్: తన వీక్నెస్ ఏంటో చెప్పిన ప్రభాస్

- December 09, 2018 , by Maagulf
కాఫీ విత్ కరణ్: తన వీక్నెస్ ఏంటో చెప్పిన ప్రభాస్

ప్రభాస్ పెళ్లెప్పుడు .. సినీ ఇండస్ట్రీలో ఇదో హాట్ టాపిక్ . కానీ ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదు . ఐతే .. ప్రభాస్ కంటే ముందే రానా పెళ్లి కావడం ఖాయం అంటున్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి . అందులో ఎలాంటి సందేహంలేదంటున్నారు. 

ఈ ముగ్గురూ తాజాగా ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ టీవీ షోలో పాల్గొన్నారు . వీరంతా గతంలో బాహుబలి సినిమా సమయంలో కలసి పనిచేసిన సంగతి తెలిసిందే . బాహుబలి నార్త్ ప్రమోషన్ కరణ్ చూసుకున్నారు . ఆ చనువుతో ఆయన టీవీ షోలో పాల్గొన్న ఈ ముగ్గురు అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

సాధారణంగా మీడియా ముందు మాట్లాడాలంటే ప్రభాస్ కు తగని సిగ్గు. అందుకే అతని ఇంటర్వ్యూలు పెద్దగా కనిపించవు . మొత్తానికి ఈ షో ద్వారా ప్రభాస్ నోరువిప్పాడు . తాను ప్రపంచంలోని అతి గొప్ప బద్దకిస్టుల్లో ఒకడినని .. బద్దకం తన అతి పెద్ద వీక్ నెస్ అని ప్రభాస్ చెప్పాడు . 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com