50 ప్లస్ వయసున్న వారిపై ఎలాంటి బ్యాన్ లేదు
- December 23, 2015
50 ఏళ్ళ పైబడి, ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వలసదారులపై బ్యాన్ లేదా రిటైర్‌మెంట్ అంశమేదీ తమ పరిశీలనలో లేదని ఒమన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ వర్గాలను ఉటంకిస్తూ కువైట్‌లోని స్థానిక మీడియా, ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేస్తున్న 50 ఏళ్ళ పైబడినవారిని మార్చ్ 2016 తర్వాత ఏ క్షణంలో అయినా టెర్మినేట్ చేసే అవకాశముందని పేర్కొంది. దీనిపై ఒమన్ ప్రభుత్వం స్పందిస్తూ అలాంటి ఆలోచన తమ ప్రభుత్వం చేయడంలేదని పేర్కొంది. ఒమన్ గవర్నమెంట్ డేటా ప్రకారం 1,682,752 మంది వలసదారులు ఒమన్‌లో పనిచేస్తున్నారు. అయితే మజ్లిస్ అల్ షురా మెంబర్ మాట్లాడుతూ, వలసదారులకు అలాగే ఒమన్ జాతీయులకూ రిటైర్‌మెంట్ ఏజ్ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉందనీ, అలా చేస్తే కొత్తవారికి అవకాశం దొరుకుతుందనీ, కొత్త కొత్త ఆలోచనలతో అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పారు. ఉద్యోగులు మాత్రం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన పేర్కొంటూ, కొత్తవారికీ అవకాశం కల్పించడంలో తప్పు లేదని అన్నారు. కువైట్‌లో మారతం 50 ఏళ్ళ పైబడిన ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్‌మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









