తుపానుగా మరనున్న తీవ్రవాయుగుండం
- December 15, 2018
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. మరో 12 గంటల్లో ఇది తుపానుగా మరే అవకాశం ఉంది. శ్రీహరికోటకు 790 కిలోమీటర్ల దూరంలో.. చెన్నైకి 775 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీవ్ర వాయుగుండం త్వరితగతిన దిశను మార్చుకుని కదులుతుంది. ఉత్తర కోస్తాలో కాకినాడ నుంచి విశాఖపట్నం మధ్య తీరం దాటే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం 17వ తేదీ రాత్రి తీరం దాటొచ్చని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అల్లకల్లోలంగా ఉన్న సముద్రం తీరం దాటే సమయంలో గంటలకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రంలో 6 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసి పడనున్నాయి. వాయుగుండం మార్పులను అనుక్షణం గమనిస్తున్న ఆర్టీజీఎస్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







