అబ్బ!! ఎంత పెద్ద వజ్రమో!

- December 15, 2018 , by Maagulf
అబ్బ!! ఎంత పెద్ద వజ్రమో!

ఒక చిన్న వజ్రం దొరికితే సంతోషంతో గాల్లోకి ఎగిరి గంతేస్తాం. అలాంటిది ఇకాస్త పెద్ద వజ్రం దొరికితే లైఫ్ సెటిల్ అయినట్లేనని భావిస్తాం. అలాంటి వజ్రం కోసం కళ్లు పెద్దవిగా చేసుకునే ఏడాది పొడవున వెతుకుతూ ఉంటారు కొందరు. తాజాగా ఉత్తరఅమెరికాలోని ఓ వజ్రాల గనిలో ప్రపంచంలోనే అత్యంత పెద్దది అయిన వజ్రం ఒకటి బయటపడింది. డొమినియన్ డైమండ్ మైన్స్‌లో ఇది బయటపడింది. . ఈ వజ్రం కొలతలు 33.74 మిల్లీ మీటర్లు బై 54.56 మిల్లీ మీటర్లుగా ఉన్నాయి.

552 క్యారట్ పసుపు పచ్చ వజ్రం.... ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద వజ్రం కంటే మూడు రెట్లు పెద్దదిగా ఉంది. ఈ తరహా వజ్రాలు సాధారణంగా దక్షిణాఫ్రికా వజ్రాల గనుల్లో దొరుకుతాయి. ప్రస్తుతం దొరికిన వజ్రం ఒక కోడిగుడ్డు సైజుకంటే కొంచెం పెద్దదిగా ఉందన్నారు డొమినియన్ వజ్రాల గనుల సంస్థ సీఈఓ షేన్ దుర్గిన్. ఈ వజ్రం అత్యంత విలువైనదని చెప్పిన ఆయన... ఈ తరహా వజ్రం చాలా అరుదైనది వెల్లడించారు. దీని విలువ ఎంత ఉంటుందో అప్పుడే అంచనా వేయలేమన్నారు. ఈ వజ్రాన్ని కట్ చేసిన తరువాతగానీ ధరపై ఒక అంచనాకు రాలేమన్నారు.

ఈ శతాబ్దంలో దొరికి వజ్రాల్లో ఇది ఏడో అతి పెద్ద వజ్రం అని చెప్పారు షేన్. 30 అతిపెద్ద వజ్రాల్లో తాజాగా దొరికిన వజ్రం కూడా ఒకటి ఉంటుందన్నారు. ఇక అతిపెద్దదిగా 3,106 క్యారెట్ల కలినన్ డైమండ్ రికార్డుల్లో ఉంది. ఈ కలినన్ వజ్రం దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో 1905లో బయటపడింది. ఈ వజ్రాన్ని రెండుగా విడగొట్టి వాటికి గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా అని, లెస్సర్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా అని నామకరణం చేశారు. ఈ రెండు వజ్రాలను బ్రిటన్ రాజు ధరించే కిరీటంలో పొందుపర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com