'రాకుమారుడు'షూటింగ్ కి రంగం సిద్దం!
- December 17, 2018
తెలుగు ఇండస్ట్రీలో మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల తర్వాత ఆ తరహా సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో నటించి మెప్పించిన హీరో కాంతారావు. ఇండస్ట్రీలో ఆయనను అందరూ కత్తి కాంతారావు అంటారు. ముఖ్యంగా కాంతారావు, విఠలాచార్య కాంబినేషన్ లో ఎన్నో జానపద చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి..ఇందులో కత్తి యుద్దంతో కాంతారావు బాగా అలరించేవారు..అందుకే ఆయను కత్తి కాంతారావు అని పిలుస్తారు. తెలుగు చిత్రాల్లో అనేక సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు.
కాంతారావు అసలు పేరు తాడేపల్లి కాంతారావు..ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కత్తి కాంతారావుగా ప్రసిద్ది పొందారు. ఈయన చిత్ర రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2000 లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది. ఆయన స్వీయ చరిత్ర "అనగనగా ఒక రాకుమారుడు". ఆయన మొత్తం 400 పైగా చిత్రాలలో నటించారు. అలాంటి కాంతారావు జీవితచరిత్రను దర్శకుడు పీసీ ఆదిత్య రూపొందిస్తున్నాడు.
కాంతారావు జీవితంలోని వివిధ కోణాలను తెరపై ఆవిష్కరించడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. 'రాకుమారుడు' అనే టైటిల్ ను ఖరారు చేసిన ఆయన, పాటల రికార్డింగ్ ను పూర్తి చేశాడు. కాంతారావు పాత్రకు గాను అఖిల్ సన్నీ అనే యువకుడిని ఎంపిక చేసుకున్నారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. రాజనాల .. దర్శకుడు విఠలాచార్య .. కృష్ణకుమారి .. రాజశ్రీ .. పాత్రలకి గాను నటీనటుల ఎంపిక జరగవలసి వుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







