మద్యం సేవించి, పెట్రోల్ స్టేషన్ని ఢీకొట్టిన డ్రైవర్
- December 18, 2018
కువైట్ సిటీ: మద్యం సేవించిన ఓ వ్యక్తి, వాహనం నడుపుతూ పెట్రోల్ స్టేషన్లోకి దూసుకెళ్ళిన ఘటనలో పెట్రోల్ స్టేషన్ కొంతమేర ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో నిందితుడ్ని భారతదేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడు, ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, అక్కడున్నవారు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడి కారులో ఆల్కహాల్ని అలాగే ఓ గ్లాస్తోపాటుగా ఐస్ క్యూబ్స్నీ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి విచారణ చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







