ఎమర్జన్సీ కాల్ సెంటర్ స్టాఫ్‌ని దూషించిన వ్యక్తి అరెస్ట్
- December 18, 2018
షార్జా పోలీస్ ఎమర్జన్సీ కాల్ సెంటర్ 911 ఉద్యోగిని దూషించిన నేరానికిగాను ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడ్ని న్యాయస్థానం యెదుట హాజరుపరిచారు. స్పెషల్ నీడ్స్ వ్యక్తి డ్రైవ్ చేసే వాహనానికి సంబంధించి పార్కింగ్ స్పేస్ కోసం నిందితుడు, కాల్ సెంటర్‌కి ఫోన్ చేశాడని విచారణలో తేలింది. స్పెషల్ నీడ్ పర్సన్‌కి సాయం చేసేందుకు తాను ఆ పని చేశాననీ, ఈ క్రమంలో తాను అదుపు కోల్పోయిన మాట వాస్తవమని విచారణలో నిందితుడు అంగీకరించాడు. కుటుంబ సమస్యల వల్ల తాను తన మాట మీద అదుపు కోల్పోవడం జరిగిందని, జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నాడు నిందితుడు. ఈ కేసు విచారణని న్యాయస్థానం డిసెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది. నిందితుడికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. బాధితురాలి వెర్షన్‌ని న్యాయస్థానం విననుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!