తెలుగు రాష్ట్రాల్లో చలి పులి ...33 మంది మృతి
- December 19, 2018
తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసిరింది. నాలుగు రోజులుగా చలి తీవ్రత కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోం ది. చలి తీవ్రత తో తెలంగాన లో ఇప్పటి వరకు 14 మంది.. అదే విధంగా ఏపిలో 19 మంది మృతి చెందారు. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా పగటి పూట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాత్రి వేళల్లో చలిని తట్టుకోలేక వృద్దులు మరణిస్తున్నారు.
చలి తీవ్రతతో తెలుగు రాష్ట్రాల్లో వృద్దులు ఇబ్బంది పడుతున్నారు. పెథాయ్ తుఫాను కారణంగా ఏర్పడిన చలి తీవ్రత తో రెండు తెలుగు రాష్ట్రాలూ గజగజలాడుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లోనూ చలిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. ఉదయం సమయంలోనే చలిని తట్టుకోవటం కష్టంగా మారుతోంది. ఒక రకంగా రాత్రి కంటే పగటిపూటే చలి ఎక్కువగా ఉంటోంది. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే ప్రజలు వణుకుతున్నారు.
ఏజెన్సీ, కోస్తాతీర ప్రాంతం, ఉత్తర తెలం గాణాల్లో చలి వాతావరణం ఎక్కువగా ఉంది. బంగాళాఖాతంలో తుఫాన్, ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులతో తెలంగా ణ, కోస్తాల్లో చలి తీవ్రత పెరిగింది. పెథాయ్ తుఫాన్ తీరం వైపు పయనించే క్రమంలో కోస్తాలో గాలుల తీవ్రత పెరిగి మేఘాలు ఆవరించాయి. శీతాకాలం కావడంతో సముద్రం మీదుగా వచ్చే గాలులతో చలి వాతావరణం నెలకొంది. ఉత్తరాది నుంచి చలిగాలులు మధ్యభారతం, దానికి ఆనుకుని తెలంగాణ, ఒడిసా వరకు వీస్తున్నాయి. టిబెట్ నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో ఉత్తరాది నుంచి మధ్య భారతం వరకు రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువ నమోదయ్యాయినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో 19.8, నిజామాబాద్ లో 19.9, ఆదిలాబాద్‌లో 20.8, నందిగామలో 23, విశాఖలో 23.7 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావారణ శాఖ అధికారులు ప్రకటించారు.
33 మంది మృతి..
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి కారణంగా తట్టుకోలేక మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తుపాను ప్రభావం తో వీస్తున్న గాలులు, చలి తీవ్రతను తట్టుకోలేక తెలంగాణ లోని వేర్వేరు ప్రాంతాల్లో 14 మంది మృతి చెందారు. కాగా ఏపీలో శీతల గాలుల ప్రభావానికి రాష్ట్రవ్యాప్తంగా 19 మంది చనిపోయారు. పెథాయ్ తుపాను అల్పపీడనంగా బలహీన పడడంతో చలికి రెక్కలొచ్చి నట్టయింది. ఈ చలిగాలులు మరి కొన్ని రోజులు ఇదే విధంగా ఉండే పరిస్థితి ఉందని.. వృద్దులు..చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖతో పాటుగా వైద్యులు సూచిస్తున్నారు..
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..