నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F11
- December 19, 2018
నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో సంచలన విజయం నమోదు చేసింది. దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ 7ఏని విజయవంతంగా రోదసీలోకి ప్రవేశపెట్టింది. నెల్లూరులోని శ్రీహరికోట నుంచి ఇవాళ సాయత్రం సరిగ్గా 4:10కి జీఎస్ఎల్వీ మార్క్2 ఎఫ్ 11 రాకెట్ ద్వారా 2,250 కేజీల బరువైన ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీశాట్ 7ఏ వైమానిక రంగానికి 8ఏళ్ల పాటు సేవలు అందించనుంది. సమాచార ఉపగ్రహ శ్రేణిలో జీశాట్ 7ఏ మూడోది. కేవలం నెలరోజు వ్యవధిలోనే ఇస్రో మూడు ప్రతిష్టాత్మక ప్రయోగాలను విజయవంతంగా పూర్తిచేయడం గమనార్హం. సమాచార వ్యవస్ధలో ఇప్పటివరకు ఇస్రో 34 ఉపగ్రహాలను రోదసీలోకి పంపింది. తాజాగా ప్రయోగించిన ఉపగ్రహంతో భారత సమాచార వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!