దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్: గోల్డ్, లగ్జరీ కార్లను గెలిచే అవకాశం
- December 19, 2018
రెసిడెంట్స్, టూరిస్ట్స్ 42 కిలోల వరకు గోల్డ్, గోల్డ్ బార్స్ గెలిచే అవకాశం.. లగ్జరీ కార్లు, టీవీలు సైతం గెలిచేందుకు వీలు.. ఇదంతా ఐదు వారాల ప్రమోషన్ షాపింగ్ ఫెస్టివల్‌తో సాధ్యం. దుబాయ్ గోల్డ్ అండ్ జ్యుయెలరీ గ్రూప్ (డిజిజెజి), దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ నేపథ్యంలో ఐదు రోజుల ప్రమోషన్‌ని ప్రారంభించింది. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ గోల్డెన్ రిటెయిల్ మూమెంట్ జరుగుతుంది. 300కి పైగా ఔట్‌లెట్స్ ఈ క్యాంపెయిన్‌లో పాల్గొననున్నాయి. దుబాయ్ గోల్డ్ అండ్ జ్యుయెలరీ గ్రూప్ ఛైర్మన్ తావ్‌హిద్ అబ్దుల్లా మాట్లాడుతూ, తొలిసారిగా గోల్డ్ మరియు డైమండ్ క్యాంపెయిన్ జరుగుతందనీ, దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌కి ఈసారి అత్యధికంగా సందర్శకులు వచ్చేందుకు ఈ ప్రమోషన్ ఉపకరిస్తుందని చెప్పారు. గోల్డ్ రఫాలె, వీక్లీ డైమండ్ రఫాలె వంటివి రిటెయిల్ సెక్టార్‌కి ఊతమిస్తాయని, దుబాయ్ ఎకానమీకి తమవంతుగా ప్రోత్సాహం అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







