షార్జా పోలీస్‌ స్టేషన్లలో 'ఐరిస్‌' స్కాన్‌

- December 24, 2015 , by Maagulf
షార్జా పోలీస్‌ స్టేషన్లలో 'ఐరిస్‌' స్కాన్‌

ఇక నుంచి షార్జా పోలీస్‌ స్టేషన్లలో ఐరిస్‌ స్కాన్‌ అందుబాటులోకి రానుంది. ఈ విధానంలో నిందితుల్ని గుర్తించడం తేలికవుతుందని పోలీసులు అంటున్నారు. వివిధ దేశాల్లోని ఎయిర్‌పోర్ట్‌ల వద్ద సెక్యూరిటీ చెక్‌ కోసం ఐరిస్‌ స్కాన్‌ వాడుతుండడం జరుగుతోంది. ఈ విధానాన్ని పోలీస్‌ స్టేషన్లలోనూ అమల్లోకి తీసుకురావడం ద్వారా నేరస్తుల్ని గుర్తించడం తేలికవుతుంది. ఒక్కోసారి పాస్‌పోర్ట్‌ పోయిందంటూ, తప్పుడు ధృవపత్రాలతో కొందరు పాస్‌పోర్టుల్ని పొందుతున్నారు. అలాంటివాటిని ఐరిస్‌ స్కాన్‌ ద్వారా నివారించవచ్చని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఐరిస్‌ స్కాన్‌ విధానంలో, ఓ పరికరంతో కనుగుడ్లను స్కాన్‌ చేస్తారు. దాన్ని మేథమెటికల్‌ కోడ్‌లో భద్రపరుస్తారు. అనుమానితులు పోలీస్‌ స్టేషన్‌కి వచ్చినప్పుడు వారి ఐరిస్‌ని సేకరించి, తమ వద్దనున్న డేటాతో సరిపోల్చుతారు. ఈ విధానం ద్వారా నేరస్తులు తేలిగ్గా పట్టుబడతారని అధికారులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com