విశ్వాసం సెన్సార్ పూర్తి
- December 24, 2018
తల అజిత్, దర్శకుడు శివల కాంబినేషన్‌లో ఇంతకుముందు వీరం, వేదాళం, వివేకం సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి నాలుగవ చిత్రం చేస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై, టి.జి.త్యాగరాజన్ సమర్పణలో, సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్న మూవీ, విశ్వాసం.. నయన తార హీరోయిన్‌గా నటిస్తుంది. అజిత్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన అజిత్ లుక్స్, మోషన్ టీజర్ అండ్ సాంగ్స్.. తల ఫ్యాన్స్‌తో పాటు, ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంటున్నాయి. విశ్వాసం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ బృందం, ఎటువంటి కట్స్, డైలాగ్ మ్యూట్ వంటివి చెప్పకుండా, క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది. అలాగే, సినిమా చాలా బాగుందని విశ్వాసం టీమ్‌ని సెన్సార్ సభ్యులు ప్రశంసించారట. ఇంతకుముందు అజిత్ నటించిన వీరం, వేదాళం, వివేకం సినిమాలకు కూడా సెన్సార్ వాళ్ళు, యూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు విశ్వాసంకి కూడా క్లీన్ యూ ఇవ్వడంతో, వాటిలానే విశ్వాసం కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని తల అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. విశ్వాసం, 2019 సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా రిలీజవనుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







