అమెరికా లో ముగ్గురు నల్గొండ వాసుల సజీవ దహనం
- December 26, 2018
అమెరికా:అమెరికాలో ఘోరం జరిగింది. కొలిరవిలిలోని ఓ ఇంటిలో జరిగిన అగ్నిప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మరొకరు కూడా కన్నుమూశారు.
క్రిస్‌మస్ సంబరాలు జరుపుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఇంట్లో మంటలు చెలరేగాయి. కింది అంతస్తులో ఈ మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఆరుగురు ఉన్నారు.
వారిలో ఇద్దరు బయటపడగా. నలుగురు సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో ఫైర్ అలారం పనిచేయక పోవడంతో ప్రమాదాన్ని వెంటనే గుర్తించలేక పోయారు. మృతుల్లో అక్క, చెల్లి, తమ్ముడు ఉన్నారు. వీరిని సాత్విక్ నాయక్, సహాస్ నాయక్, జయసుచిత్‌గా గుర్తించారు.
వీరి స్వస్థలం నల్లగొండ జిల్లా నేరేడుకొమ్మ మండలం గుర్రపుతాండ. చదువుల కోసం వీరు అమెరికాలో ఉంటున్నారు. వీరి తల్లిదండ్రులు మిషనరీ పని మీద నల్లగొండ జిల్లాకు వచ్చారు. ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..