90 శాతం డిస్కౌంట్స్.. డిఎస్‌ఎఫ్ నేడే ప్రారంభం
- December 26, 2018
సిటీ వైడ్ ప్రమోషన్స్, మాసివ్ సేల్స్, ఫైర్ వర్క్స్ మళ్ళీ దుబాయ్‌లో సందడి చేయనున్నాయి. 24వ ఎడిషన్ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ నేడే ప్రారంభమవుతోంది. ఫిబ్రవరి 2 వరకు ఈ షాపింగ్ ఫెస్టివల్ జరుగుతుంది. 700కి పైగా బ్రాండ్స్ ఈ షాపింగ్ ఫెస్టివల్‌లో షాపింగ్ ప్రియుల కోసం కొలువుదీరాయి. 3,200 ఔట్‌లెట్స్ సిటీ వ్యాప్తంగా ఈ సేల్‌లో పాల్గొంటున్నాయి. 90 శాతం వరకు డిస్కౌంట్స్ ఈ షాపింగ్ ఫెస్టివల్ ప్రత్యేకత. 12 గంటల సేల్‌తో ప్రారంభమవుతున్న షాపింగ్ ఫెస్టివల్, 90 శాతం వరకు సేల్స్‌ని మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ వద్ద అందిస్తోంది. సిటీ సెంటర్ మిర్దిఫ్, సిటీ సెంటర్ డేరా, సిటీ సెంటర్ మైసీమ్, సిటీ సెంటర్ బర్షా, సిటీ సెంటర్ అల్ షిందఘా తదితర మాల్స్‌లోనూ ఈ ఆఫర్స్ వర్తిస్తాయి. మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు ఈ అద్భుతమైన సేల్ కొనసాగుతుంది. రేపటినుంచి దుబాయ్ వీకెండ్ సర్‌ప్రైజెస్ సందర్శకుల్ని ఆకట్టుకోనున్నాయి. ప్రతి గురు, శుక్రవారాల్లో దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ సందర్భంగా ఫైర్ వర్క్స్ ప్రధాన ఆకర్షణ కానున్న సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







