ఎన్ఐఏ సోదాలు.. ఐసిస్‌తో లింకున్న అయిదుగురి అరెస్టు
- December 26, 2018
న్యూఢిల్లీ: భారత్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు లింకున్న ఓ గ్రూపు కొత్త తరహా మాడ్యూల్‌ను నిర్వహిస్తున్నది. ఆ కేసుకు సంబంధం ఉన్న 16 చోట్ల ఇవాళ ఎన్ఐఏ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అయిదుగుర్ని అరెస్టు చేశారు. మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీతో పాటు యూపీలోని కొన్ని ప్రాంతాలు ఈ దాడులు కొనసాగుతున్నాయి. హర్కత్ ఉల్ హర్బ్ ఇ ఇస్లామ్ అనే సంస్థ.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్నది. యూపీలోని అమ్రోహా కేంద్రంగా హర్కత్ సంస్థ పనిచేస్తున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గుర్తించింది. కొత్త తరహా ఉగ్ర మాడ్యూల్‌ను నిర్వహిస్తున్న ఓ మౌలానాతో పాటు సివిల్ ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ కొత్త మాడ్యూల్‌కు సూత్రధారులని ఎన్ఐఏ నిర్ధారించింది. వచ్చే నెలలో జరగనున్న రిపబ్లిక్ డే సంబరాలకు ముందు దేశ రాజధానితో పాటు యూపీలోని పలు చోట్ల దాడులకు ప్లానేసినట్లు ఎన్ఐఏ పేర్కొన్నది. దాడులు నిర్వహించిన పోలీసులు.. వివిధ ప్రాంతాల నుంచి అమోనియం నైట్రేట్, పిస్తోళ్లను రికవర్ చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







