ఆఫ్ఘనిస్తాన్‌లో అధ్యక్ష ఎన్నికలు వాయిదా
- December 27, 2018
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లుప్రభుత్వంప్రకటించింది. ఓటర్ల జాబితాలపరిశీలనకు మరింత వ్యవధి అవసరం అవుతుందని, సాంకేతికసమస్యలను పరిష్కరించాల్సి ఉందని ఎన్నికల సంఘం ప్రకటించింది. వాస్తవానికి వచ్చే ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కొన్ని నెలలపాటు వాయిదావేయాలని దీనివల్ల ఎదురవుతున్న సాంకేతిక సమస్యలన్నింటినీ పరిష్కరించుకోగలమని అన్నారు. అక్టోబరులోని పార్లమెంటరీ ఎన్నికల్లో వెల్లువెత్తిన సమస్యలను పరిశీలించి పరిష్కరించాల్సి ఉందని బుధవారం ఎన్నికల అధికారులు వెల్లడించారు.ఓటర్లజాబితాలపరిశీలనకు మరింత సమయం అవసరం అవుతుందని, ఎన్నికల సిబ్బందిని బయోమెట్రిక్ద్వారా గుర్తించేందుకు మరింత శిక్షణ అవసరం అవుతుందని దీనివల్ల మోసాలను అరికట్టేందుకు వీలవుతుందని స్వతంత్ర ఎన్నికల సంఘం అధికారప్రతినిధి అబ్దుల్ అజీజ్ ఇబ్రహిమీ వెల్లడించారు. పార్లమెంటరీ ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి. కొందమంది సిబ్బందికి బయోమెట్రిక్ విధానంపై శిక్షణ ఇచ్చినా పోలింగ్బూత్లవద్ద కనిపించలేదు. రిజిస్టరు అయిన ఓటర్లు లెక్కకుమించి వారి పేర్లు జాబితాల్లో లేవని ఫిర్యాదులుచేసారు. రెండోరోజుసైతం పోలింగ్నిరవ్హఇంచాల్సి వచ్చింది.
కొన్ని వందలపోలింగ్కేంద్రాలను ఆలశ్యంగా ప్రారంబించారు. అనేక న్యాయపరమైన ఫిర్యాదులుసైతం ఎన్నికల ఫలితాలను సవాల్‌చేస్తూ దాఖలయ్యాయి. అద్యక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయే కానీ నిర్దిష్టమైన తేదీని ప్రకటించలేదు. 2014లోజరిగిన అధ్యక్ష ఎన్నికలు పూర్తి వివాదాస్పదంగా మారాయి.
మోసూపూరిత విదానంలో అధక్ష ఎన్నికలు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇద్దరు అగ్రశ్రేణి నాయకులు అష్రాఫ్ ఘని, అబ్దుల్లా అబ్దుల్లాలు గట్టిపోటీమధ్య ఎన్నికలరంగంలోనిలిచారు. ఎన్నికల ఫలితాలు వెలువడేముందే అబ్దుల్లా భారీ ఎత్తున ఓట్ల మోసం జరిగిందని పేర్కొంటు తీవ్రస్థాయిలోనిరసన వ్యక్తంచేసారు. అమెరికా హోంశాఖ సహాయ మంత్రి జాన్‌కెర్రీ జోక్యంతో వివాదాలనుసర్దుబాటుచేసి ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చి ఎన్నికల ఫలితాలను వెల్లడించేటట్లు చేయడంతో అష్రాఫ్ ఘని ఎన్నికయ్యారు.
ఘని అద్యక్షునిగా రాగా అబ్దుల్లాను కొత్తగ ఆసృష్టించిన ఛీప్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించారు. ఈ ఏర్పాటు కేవలం రెండేళ్లు మాత్రమే ఉంటుందని చెప్పినా ఇప్పటివరకూ కొనసాగింది. దీనితోప్రభుత్వంలోనే తీవ్రస్థాయిలోగ్రూపులు ఏర్పడి చివరకు తాలిబన్లను కట్టడిచేయలేనిస్థితికి చేరారు. ఎన్నికల వాయిదా వల్ల 17 ఏళ్ల అంతర్యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాకు మరింతచర్యలు తీసుకునే వీలుంటుంది.
అమెరికా శాంతిరాయబారి జలమే ఖలిల్జాద్ ఇదేవిషయమై ఈ ప్రాంతంలో అనేకసార్లుపర్యటించారు. తాలిబన్ నేతలతోఅనేకపర్యాయాలు సంప్రదింపులు కూడా జరిపారు. తాలిబన్ నేతలు, ఆఫ్ఘన్ ప్రభుత్వం ఏప్రిల్ ఓటింగ్‌కు ముందే ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తాయని ఖలీల్జాద్ ప్రకటించారు. అయితే రెండువైపులా కూడా ఇదొక అవాస్తవిక గడువు అని పేర్కొనడం గమనార్హం.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







