అబ్డక్షన్ ఛార్జెస్: కువైటీ అరెస్ట్
- December 27, 2018
కువైట్ సిటీ: తన కుమారుడ్ని కిడ్నాప్ చేసేందుకు యత్నించారంటూ సిరియాకి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఓ కువైటీని అధికారులు అరెస్ట్ చేశారు. తన ఇంటి పక్కనే వుండే కువైటీ వ్యక్తి, తన కుమారుడ్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడనీ, ఈ క్రమంలో తాము గట్టిగా అరిచేసరికి నిందితుడు అక్కడినుంచి పారిపోయాడని ఫిర్యాదులో సిరియా వ్యక్తి ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు తొలుత చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అనంతరం, నిందితుడ్ని పట్టుకున్నారు పోలీసులు. అరెస్ట్ చేసే సమయంలో నిందితుడు మద్యం సేవించి వున్నాడనీ, పోలీసుల్ని ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా పట్టుకున్నామని అధికారులు చెప్పారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడ్ని సంబంధిత అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







